శ్రీకాకుళం జిల్లా ప్రజలు కొవిడ్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ నివాస్ పిలుపునిచ్చారు. జిల్లాలో 4687 కరోనా కేసులు ఉన్నాయని అన్నారు. కరోనా పరీక్షల సంఖ్యను పెంచామని తెలిపారు. ప్రజలు అందించిన విరాళాల సహకారంతో ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పీపుల్స్ ల్యాబ్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. గతంలో నమూనాలు తీసిన తరువాత కొంత సమయం పట్టేదని... ఇకపై 24 గంటల్లో ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు.
కొవిడ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ - corona virus
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ నివాస్ పిలుపునిచ్చారు.
![కొవిడ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ srikakulam collector](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8194522-266-8194522-1595865930917.jpg)
srikakulam collector