శ్రీకాకుళం జిల్లాలో కరోనా వైరస్ కేసులు తొలిసారిగా నమోదయ్యాయి. పాతపట్నం మండలంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు పాజిటివ్‌గా తేలినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. వారికి బుధవారం వైద్యపరీక్షలు నిర్వహించారు. అప్రమత్తమైన అధికారులు... బాధితులు నివసించే గ్రామానికి మూడు కిలోమీటర్ల పరిధిలోని 27 గ్రామాలను కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు. ఎవరూ ఇంటి నుంచి బయటకు రావొద్దని, ఇంటికే నిత్యావసరలు పంపిస్తామని తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా అధికారులు అప్రమత్తం - corona cases in srikakulam news
శ్రీకాకుళం జిల్లాలోనూ కరోనా ప్రభావం మొదలైంది. జిల్లాలో కొత్తగా 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. జిల్లాలోనూ కరోనా వెలుగుచూడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
![శ్రీకాకుళం జిల్లా అధికారులు అప్రమత్తం srikakulam alert for corona cases](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6933236-thumbnail-3x2-sklm.jpg)
srikakulam alert for corona cases