లాక్డౌన్తో రోజువారి కూలీలు, చేసేందులు పనులు లేక పేదలు పూట గడవక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు చెందిన శ్రీ వెంకట లక్ష్మీ ఆటో సెంటర్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వెయ్యికి పైగా కుటుంబాలకు కూరగాయలు పంచిపెట్టారు. ద్విచక్ర వాహన సంస్థ ప్రతినిధి తంగుడు ఉపేంద్ర, ఎస్.వి.ఎల్ సంస్థ అధినేత తంగుడు సీతారామరాజు, కృష్ణారావు తదితరులు వీటిని ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. సేవా భారతి ఆధ్వర్యంలో నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన మార్కెట్లో సేవలందిస్తున్న పోలీస్, ఆర్టీసీ సిబ్బంది, పీఈటీలకు అల్పాహారాన్ని అందజేశారు.
లాక్డౌన్ వేళ.. పేదలకు అసరాగా - శ్రీకాకుళంలో కూరగాయలు పంపిణీ వార్తలు
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. దీంతో పేదలు, రోజువారి కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కష్టకాలంలో ఉన్నవారికి తామున్నామంటూ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు చెందిన కొందరు పేదలను ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు.
శ్రీకాకుళంలో శ్రీ వెంకట లక్ష్మీ ఆటో సెంటర్ ఆద్వర్యంలో కూరగాయల పంపిణీ