ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా శివాలయాల్లో ప్రత్యేక పూజలు.. పోటెత్తిన భక్తజనం - special pooja in lord shiva temples in srikakulam district

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. శివాలయాలకు భక్త జనం భారీగా తరలివెళ్లింది.

sri-mukhalingeswara-temple
క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు

By

Published : Mar 11, 2021, 1:05 PM IST

శ్రీకాకుళం జిల్లా శ్రీ ముఖలింగేశ్వర ఆలయంలో మహా శివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. ఉదయం నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. అధిక సంఖ్యలో వచ్చే భక్తుల కోసం దేవాదాయశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంది. అధిక సంఖ్యలో భక్తులు తరలిరావటంతో క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి. స్థానికులతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి వచ్చిన జనంతో ఆలయం ప్రాంగణం రద్దీగా మారింది.

ఆముదాలవలసలో...

మండలంలోని శివాలయాల్లో వేకువజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. స్వామివారికి క్షీరాభిషేకం, నారికేళ అభిషేకం, పంచామృతాభిషేకం, సహస్ర బిల్వార్చన చేశారు.

టెక్కలిలో...

రావివలసలో ఎండల మల్లికార్జున స్వామి శివ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. దేవస్థానానికి వెళ్లే రెండు దారుల్లోనూ పెద్దఎత్తున భక్తులు బారులు తీరారు. దేవాదాయ శాఖ, పోలీసు యంత్రాంగం పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఇదీ చదవండి:

వారణాసి... పరమేశ్వరుని సృష్టి

ABOUT THE AUTHOR

...view details