శ్రీకాకుళం జిల్లాలోని 27 గ్రామాల్లో... అధికారులు కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించారు. శనివారం నుంచి ప్రజలు ఇళ్ల వద్ద నుంచి బయటకు రాకుండా చర్యలు చేపట్టారు. ఆయా గ్రామాల్లో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. రక్షిత తాగునీటి పథకాల నుంచి నీటిని ట్యాంకుల ద్వారా సరఫరా చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో నిత్యావసర సరుకులు, కూరగాయలు ఆదివారం మధ్యాహ్నం వరకు సరఫరా చేయలేదు. ఆయా గ్రామాల్లో నియమించిన ప్రత్యేక అధికారులు ఒప్పందం కుదుర్చుకున్న దుకాణదారులతో సరుకులు విక్రయాలు చేపట్టేందుకు చర్యలు చేపట్టారు.
సిక్కోలులో అధికారుల ముందస్తు జాగ్రత్తలు - జిల్లాలో మూడు కరోనా పాజిటివ్ కేసులు తాజా వార్తలు
శ్రీకాకుళం జిల్లాలో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో శానిటేషన్ పనులతో పాటు.. సరుకుల పంపిణీలోనూ అప్రమత్తంగా ఉంటున్నారు.
శిక్కోలులో మరిన్ని జాగ్రత్తలు