అరసవల్లిలో వైభవంగా రథసప్తమి వేడుకలు - రథ సప్తమి
మనకు కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు మాత్రమే. సమస్త జీవరాశులకు వెలుగునిచ్చే ఆదిత్యుని కరుణా కటాక్షాలు పొందే సుదినమే మాఘమాస శుద్ధసప్తమి...అదే రథసప్తమి.
అరసవల్లి ప్రారంభమైన రథసప్తమి వేడుకలు
ఆరోగ్య ప్రధాతగా ఆశేష భక్తులతో పూజలందుకుంటున్న అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామి వారి పుట్టిన రోజు సందర్భంగా...ముందుగా ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ స్వామికి క్షీరాభిషేకం, పంచామృతాలతో పూజలు నిర్వహించారు. దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ మూర్తి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. స్వామిని దర్శనానికి భక్తులు బారులు తీరారు.