శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో.. సూర్య నమస్కారాల కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో అర్చక, వైదిక సిబ్బంది ద్వాదశ రూపాల్లో సూర్యనమస్కారాలతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. కరోనా మహమ్మారి ప్రబలకుండా చూడాలని కోరుతూ సూర్య దేవునికి పూజలు నిర్వహిస్తున్నామని ఆలయ నిర్వాహకులు తెలిపారు.
కరోనా అంతానికి అరసవల్లి సూర్య దేవాలయంలో పూజలు - అరసవల్లి సూర్య దేవాలయంలో కరోనా పూజల వార్తలు
కరోనా మహమ్మారి ప్రబలకుండా చూడాలని కోరుతూ.. అరసవల్లి సూర్యదేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ద్వాదశ రూపాల్లో సూర్యనమస్కారాలు నిర్వహించారు.
అరసవల్లి సూర్య దేవాలయంలో పూజలు