వర్షాకాలంలో పాతపట్నంలోని శ్రీ నీలకంటేశ్వర స్వామి ఆలయం ప్రత్యేకతను సంతరించుకుంటుంది. వర్షాలతో గర్భగుడిలో నీటి ఊట రావడంతో శివలింగం కొంత మేర గంగమ్మలో కలసిపోయి కనిపిస్తుంది. ఈ సమయంలో భక్తులు పెద్దఎత్తు పాల్గొని ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రతి సోమవారం ఉత్సవ రీతిలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామికి మొక్కులు చెల్లిస్తారు. శివలింగం నీటిలో భక్తులకు దర్శనమివ్వటంతో జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివస్తుంటారు.
నీటిలో శివలింగం..భక్తుల పారవశ్యం
శ్రీకాకుళం పాతపట్నంలోని శ్రీ నీలకంటేశ్వరుడి ఆలయంలో శివలింగం నీటిలో దర్శనమిస్తుంది. వర్షాకాలంలో గర్భగుడిలో నీటి ఉట రావడంతో శివలింగం నీట మునుగుతుంది. ఈ సమయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
శ్రీ నీలకంటేశ్వరుడి ఆలయంలో ప్రత్యేక పూజలు