IRCTC gave good news to pilgrims: తక్కువ ఖర్చుతో దక్షిణ భారతదేశంలో ఉన్న దేవాలయాలన్నీ చూద్దామనుకునే వారికి ఇండియన్ రైల్వే కాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) శుభవార్త చెప్పింది. దక్షిణ భారత దేవాలయాలను సందర్శించాలనుకునే ప్రయాణికుల కోసం తక్కువ ఖర్చుతో భారతీయ రైల్వే ప్రత్యేక రైలును ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రయాణికులకు ప్రయోజనం కోసం ఈ రైలును ప్రారంభిస్తున్నట్లు ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ బి. చంద్రమోహన్ తెలిపారు.
రైలు బయల్దేరు వివరాలు:ఈ రైలు డిసెంబర్ 3న విశాఖపట్నంలో మధ్యాహ్నం 1:30 నిమిషాలకు బయల్దేరి శ్రీకాకుళం రోడ్డుకు చేరుకుంటుందని.. తిరిగి 12వ తేదీన విశాఖపట్నం వస్తుందని.. ఈ రైలులో సౌత్ ఇండియా మొత్తం పర్యటించవచ్చని అధికారులు తెలిపారు.