ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్న రహదారులు.. పట్టించుకోండి సారూ..!

రహదారంటే మేఘాలలో తేలిపోయేలా ఉండాలి. వాహనాలు పరుగులు తీసేలా ఉండాలి. నిర్ణీత సమయంలో గమ్యస్థానం చేరేలా ఉండాలి. వాహనాదారుల ప్రయాణం సాఫీగా సాగేలా ఉండాలి. కానీ.. శ్రీకాకుళం జిల్లాలోని రహదారులు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఇక వర్షాలు పడితే అంతే.. వాహనదారుల బాధలు వర్ణనాతీతం. ఆ పాట్లు పడలేక కొందరు ప్రయాణాలు సైతం మానుకుంటున్నారు. అడుగుకో గుంతతో జనాలు నానా అవస్థలు పడుతున్నారు.

damaged roads in srikakulam district
శ్రీకాకుళం జిల్లాలో అద్వానంగా మారిన రహదారులు

By

Published : Aug 31, 2021, 10:57 PM IST

ప్రయాణికులను బెబేలెత్తిస్తున్న ప్రధాన రహదారులు

శ్రీకాకుళం జిల్లాలో వాన వచ్చిదంటే వాహదారులు బెంబేలెత్తాల్సి వస్తోంది. చాలా ప్రాంతాల్లో అడుగడుగునా ఏర్పడిన గుంతల రహదారుల్లో ప్రయాణామంటేనే జనాలకు వణుకు పుడుతోంది. కొన్ని రహదారులైతే అడుకో గుంతతో దర్శనమిస్తున్నాయి. మరికొన్ని రహదారులు రాళ్లు తేలి అస్తవ్యస్థంగా మారిపోయాయి. ఇక గ్రామీణ ప్రాంతాలలోని దారుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. రోడ్డుల అధ్వానంగా మారడంతో.. ఆయా మార్గాలో ప్రయాణమంటేనే వాహనదారులు బయపడుతున్నారు.

ఛిన్నాభిన్నంగా రాజాం - పాలకొండ ప్రధాన రహదారి

రాజాం - పాలకొండ ప్రధాన రహదారి.. రహదారిలానే లేదు. రాజాం మీదుగా పాలకొండ వరకు రోడ్డు చిన్నాభిన్నమైంది. పెద్ద గుంతలు ఏర్పడటంతో రాకపోకలు సాగించలేని దుస్థితికి చేరింది. ప్రయాణికులకు రహదారులు నిత్యం నరకం చూపిస్తోంది. వర్షాలు కురవటంతో పరిస్థితి మరింతంగా దిగజారింది. రహదారిపైకి రావాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఈ 21 కిల్లోమీటర్ల ప్రయాణం నిత్య నరకం. రోజూ వేలాది వాహనాల్లో ప్రయాణించువారు నిత్యం ఇబ్బందులకు గురవుతున్నారు. ఎనిమిది ఏళ్లుగా చిన్నాభిన్నామైన రోడ్ల నవీకరణ ఊసే శూన్యం. దీంతో వాహనాలు తుక్కతుక్కు అవుతున్నాయి.

30 నిమిషాల్లో పూర్తి కావాల్సిన ప్రయాణం.. గంటకుపైగా పడుతోందని వాహనదారులు చెబుతున్నారు. అలాగే జిల్లా కేంద్రం నుంచి ఆమదాలవలస రహదారిలో వాహనాలపై వెళ్లాలంటే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. శ్రీకాకుళం రోడ్డు రైల్వేస్టేషన్‌కు ఈ రహదారే గతి. దీంతో నిత్యం నరకం చూస్తున్నామని ప్రయాణికులు చెబుతున్నారు.

గ్రామీణ రోడ్లు మరీ దారుణం..

గ్రామీణ రాహదారులు మరింత దారుణంగా మారాయి. వర్షాలు పడటంతో దారులన్నీ బురదమయంగా మారిపోయాయి. ఆ మార్గాల్లో వెళ్లాలంటే సముద్రాన్ని దాటినంత పని. టెక్కలి, ఎచ్చెర్ల నియోజకవర్గంలోని గ్రామీణ రహదారులు మరింత ఘోరంగా తయారయ్యాయి. పిల్లలు బడికి వెళ్తే వాళ్లు వచ్చేవరకు బయం బయంగా ఉంటున్నాని అంటుకున్నారు. నానాపాట్లు పడుతున్నామని.. వాహనాలు సైతం త్వరగా షెడ్​కు వెళ్తున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. ముఖ్యమంత్రి జగన్​ స్పందించి జిల్లాలోని రహదారులకు మోక్షం కలిగించాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:

NHRC: కొండపల్లి మైనింగ్‌పై వర్ల రామయ్య లేఖ.. విచారణకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశం

ABOUT THE AUTHOR

...view details