శ్రీకాకుళం జిల్లా పాలకొండ డివిజన్ పరిధిలోని పలు మండలాల్లో ఆర్డీఓ కుమార్, డీఎస్పీ ఎన్. శ్రావణి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా భౌతిక దూరం పాటించకుండా, మాస్కులు లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్న 44 దుకాణాలను సీజ్ చేశారు. కొవిడ్ నిబంధనలకు వ్యతిరేకంగా అధికశాతం మంది ప్రయాణికులను ఎక్కించుకొని తిరుగుతున్న 34 వాహనాలను పట్టుకున్నారు.
శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి సీతంపేట, కొత్తూరు, హిరమండలం, సారవకోట, పాలకొండ మండలాల్లో కరోనా నిబంధనలు అమలుపై ఈ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. పాలకొండలో ఎల్లమ్మ కూడలి వద్ద మధ్యాహ్నం 12 గంటల తర్వాత రాకపోకలు సాగిస్తున్న 27 వాహనాలకు ఫైన్ వేశారు.