ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సభాపతి తమ్మినేని - తమ్మినేని న్యూస్

పేద, మధ్య తరగతి పిల్లలకు విద్యావకాశాలు అందించటమే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యమని సభాపతి తమ్మినేని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని పాఠశాలల్లో జరుగుతున్న నాడు-నేడు పనులను ఆయన పరిశీలించారు.

పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సభాపతి తమ్మినేని
పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సభాపతి తమ్మినేని

By

Published : Nov 10, 2020, 11:02 PM IST

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో పర్యటించిన సభాపతి తమ్మినేని సీతారాం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని పాఠశాలల్లో జరుగుతున్న నాడు-నేడు పనులను పరిశీలించారు. గతంలో స్కూళ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉండేదని ప్రస్తుతం కార్పొరేట్ స్కూళ్లతో పోటీ పడే విధంగా తయారు చేస్తున్నామని తెలిపారు. పేద, మధ్య తరగతి పిల్లలకు విద్యావకాశాలు అందించటమే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యమన్నారు.

ABOUT THE AUTHOR

...view details