సభాపతి తమ్మినేని సీతారాం కరోనా బారిన పడ్డారు. ఐదు రోజుల నుంచి శ్రీకాకుళంలోని మెడికవర్ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు... తమ్మినేనికి చికిత్స అందిస్తున్న వైద్యులు వెల్లడించారు. తమ్మినేని సీతారాం కంటే ముందు.. ఆయన సతీమణి వాణీశ్రీకి వైరస్ సోకటంతో.. ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు సభాపతి దంపతుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పడు ఆరా తీస్తున్నారు.
సభాపతి తమ్మినేనికి కరోనా - speaker tammineni latest news
సభాపతి తమ్మినేని సీతారాంకు కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

సభాపతి తమ్మినేనికి కరోనా