శ్రీకాకుళం జిల్లాలో శాసన సభాపతి తమ్మినేని సీతారాం సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారు. వైకాపా ప్రభుత్వం.. అవినీతిలేని పాలన అందిస్తోందని చెప్పారు. వచ్చే సీజన్‌లోగా తండ్యాం ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామన్నారు.
పొందూరు మండలం రాపాక జంక్షన్ వద్ద మంచినీటి చానెల్‌ను శాసన సభాపతి తమ్మినేని సీతారాం ప్రారంభించారు. తండ్యాం గ్రామంలో సుమారు 21.80 లక్షల రూపాయల అంచనా నిధులతో రైతు భరోసా కేంద్రానికి శంకుస్థాపన చేశారు.