ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గిరిజనులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: స్పీకర్ - speaker tammineni latest news

బూర్జ మండలంలో స్పీకర్ తమ్మినేని సీతారాం పర్యటించారు. గిరిజనులకు పట్టాలు పంపిణీ చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గిరిజనులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఉద్ఘాటించారు.

speaker tammineni tour in Srikakulam District
గిరిజనులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: స్పీకర్

By

Published : Nov 3, 2020, 6:42 PM IST

శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం వైకుంఠపురం గ్రామంలో మూడు లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్​ను శాసన సభాపతి తమ్మినేని సీతారాం ప్రారంభించారు. అల్లిపల్లిగూడ గ్రామంలో గిరిజనులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
గిరిజనులు భూమిపై ఆధారపడతారని, వాళ్లకు రెండు ఎకరాల భూమిని కేటాయించి ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు. గిరిజనులను ఆదుకునే మంచి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని అన్నారు. జిల్లాలో 22,000 గిరిజన లబ్ధిదారులకు 32 వేల ఎకరాల పట్టాలు పంపిణీ చేయడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు.

ABOUT THE AUTHOR

...view details