ఆమదాలవలస మండలంలోని కలివరం, ముద్దాడ గ్రామాల్లో తమ్మినేని సీతారం పర్యటించారు. నాగావళి నదిలో దిగడానికి అనువుగా ఉండే ర్యాంపులు గతంలో వరదకు కొట్టుకుపోయాయని.. వాటిని తిరిగి నిర్మించాలని కోరారు. తాగునీరు ఇబ్బందిగా ఉందని మంచినీటి కుళాయిలు, కమ్యూనిటీ హాల్ కావాలన్నారు. పాఠశాల శిథిలావస్థకు వచ్చిందని స్కూల్ లేక బయట చెట్ల కింద పిల్లలు పాఠాలు వింటున్నారన్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి చేయిస్తానని సభాపతి హామీ ఇచ్చారు.
కలివరం, ముద్దాడ గ్రామాల్లో సభాపతి తమ్మినేని పర్యటన - ఆమదాలవలసలో స్పీకర్ తమ్మినేని పర్యటన వార్తలు
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం కలివరం గ్రామపంచాయతీ పరిధిలోని కలివరం, ముద్దాడ పేట గ్రామాల్లో శాసన సభాపతి తమ్మినేని సీతారాం పర్యటించారు. సమస్యలను సభాపతి దృష్టికి ఆయా గ్రామల ప్రజలు తీసుకువచ్చారు.
![కలివరం, ముద్దాడ గ్రామాల్లో సభాపతి తమ్మినేని పర్యటన speaker tammineni sitharam visit kalvaram and muddhada villages](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10839779-775-10839779-1614683909462.jpg)
speaker tammineni sitharam visit kalvaram and muddhada villages