ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'గడప గడపలో' తొడగొట్టిన స్పీకర్​ తమ్మినేని - శ్రీకాకులంలో తొడకొట్టిన స్పీకర్

Speaker Tammineni Sitaram: బూర్జి మండలంలో నూతనంగా నియమించిన గ్రామ వాలంటీర్ల నియామకం కార్యక్రమంలో స్పీకర్​ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను వివరిస్తూ.. ప్రజలు ఏమనుకుంటున్నారో వివరించారు. అంతేకాదు తొడగొట్టి మరీ ఓ విషయం చెప్పారు. అది ఏంటంటే.. !

speaker tammineni seetaram
speaker tammineni seetaram

By

Published : Jan 1, 2023, 12:18 PM IST

Speaker Tammineni Sitaram: శ్రీకాకుళం జిల్లా బూర్జి మండలంలో నూతనంగా నియమించిన గ్రామ వాలంటీర్ల నియామకం కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబుపై తీవ్రమైన అనుచిత వ్యాఖ్యలు చేశారు.ఎన్నికల సమయంలో యువతకు ఉద్యోగాలు ఇస్తామని, రైతు రుణాలు మాఫీ చేస్తామని, నిరుద్యోగ భృతి అందిస్తామని హామీలిచ్చి చంద్రబాబునాయుడు మోసం చేశారని, ప్రజలు అందుకే గత ఎన్నికల్లో బుద్ధి చెప్పారని ఏపీ శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. మళ్లీ జగన్‌కే ఓటేస్తామని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఓ మహిళ తొడకొట్టి చెప్పిందని, ఆమెను అనుకరిస్తూ తమ్మినేని సీతారాం తొడకొట్టారు.

నారావారి పల్లెలో రెండెకరాల భూమి ఉన్న చంద్రబాబు ఇప్పుడు కోటీశ్వరుడు ఎలా అయ్యారని, ఆయన దగ్గర ఏమైనా మంత్ర దండం ఉందా..? ఉంటే దాన్ని ప్రజలకు అందిస్తే నిరుపేద అంటూ ఎవరూ ఉండరని పేర్కొన్నారు. టీడీపీ వస్తే వాలంటీర్‌ వ్యవస్థను పీకి పారేస్తామని చెబుతున్నారని తెలిపారు. వాలంటీర్లను వైసీపీ ప్రభుత్వ ఉద్యోగుల కింద త్వరలో ప్రకటన చేయనుందన్నారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details