శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని లొద్దలపేట, నెల్లిపర్తి వద్ద ఇరిగేషన్ పనులకు శాసన సభాపతి తమ్మినేని సీతారాం శంకుస్థాపన చేశారు. లొద్దలపేట గ్రామంలో సుమారు రూ. 9 లక్షల నిధులతో 4 కిలోమీటర్ల పొడవైన కాలువ పనులను ప్రారంభించారు. ఈ పనులు పూర్తైతే ఆమదాలవలస, పొందూరు మండలాల్లో సుమారు 2500 ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుందని చెప్పారు.
మరో రూ. 9 లక్షలతో నెల్లిపర్తి వద్ద హైలెవల్ ఛానల్ పనులను స్పీకర్ ప్రారంభించారు. ఈ నిర్మాణం పూర్తి అయితే కెనాల్ దిగువన ఉన్న 2000 ఎకరాల రైతులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తమ్మినేని శ్రీరామ్మూర్తి, సర్పంచ్లు, వైకాపా నేతలు పాల్గొన్నారు.