ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పథకాలు అందరికీ అందాలి.. అందుకోసమే సచివాలయ వ్యవస్థ' - స్పీకర్ తమ్మినేని సీతారాం వార్తలు

శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలంలో సభాపతి తమ్మినేని సీతారాం పర్యటించారు. మండలంలోని కొండవలస, పెద్దపాలెం గ్రామాల్లో రైతుభరోసా కేంద్రాలు, నాడు-నేడు నిర్మాణ పనులను పరిశీలించారు. సీఎం జగన్ పరిపాలనలోకి వచ్చిన సంవత్సరంలోనే 90 శాతం హామీలు నెరవేర్చారని స్పీకర్ తెలిపారు.

tammineni sitaram
తమ్మినేని సీతారాం

By

Published : Sep 23, 2020, 5:52 PM IST

ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందాలనే లక్ష్యంతో వైకాపా ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టిందని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం కొండవలస, పెద్దపాలెం గ్రామాల్లో సచివాలయం, రైతుభరోసా కేంద్రాలు, నాడు-నేడు నిర్మాణ పనులను పరిశీలించారు.

నిర్మాణ పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగడానికి వీల్లేదని అధికారులకు సూచించారు. సీఎం జగన్ అధికారం చేపట్టిన సంవత్సర కాలంలోనే నవరత్నాల్లో చాలా హామీలు నెరవేర్చారన్నారు. జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, నాడు-నేడు కార్యక్రమాలతో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా మారుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైకాపా నాయకులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details