Speaker fired on Civil Supply Officer : శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ఎంపీడీవో కార్యాలయం వద్ద స్పీకర్ తమ్మినేని సీతారాం జిల్లా సివిల్ సప్లైస్ మేనేజర్ జయంతిపై ఫోన్ లో సీరియస్ అయ్యారు. ఆమదాలవలస వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాంలో పని లేక కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని..జిల్లాలో ఉన్న ఏ మిల్లు నుంచి బియ్యం రావట్లేదని వివరించారు. దీంతో ఖాళీగా ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలు విన్న స్పీకర్ స్పందిస్తూ సివిల్ సప్లై మేనేజర్ కు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో నేను చెప్పినా ఇంతవరకు మీరు ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఆగ్రహించారు. ఏం తమాషా చేస్తున్నారా నేను ఎవరు అనుకుంటున్నారు అంటూ ఆమెపై విరుచుకుపడ్డారు. తక్షణమే ఆమదాలవలస వచ్చి కూలీలకు పని కల్పించాలని ఆదేశించడంతో ఆమె వచ్చి సమస్య పరిష్కరిస్తానని చెప్పడంతో శాంతించారు.
Speaker fired on Civil Supply Officer : ఎన్నిసార్లు చెప్పినా చర్యలేవీ..? -సివిల్ సప్లై అధికారి పై స్పీకర్ ఆగ్రహం - సివిల్ సప్లై అధికారి పై స్పీకర్ ఆగ్రహం
Tammineni fired on civil supply Officer : శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ఎంపీడీవో కార్యాలయం వద్ద స్పీకర్ తమ్మినేని సీతారాం జిల్లా సివిల్ సప్లైస్ మేనేజర్ జయంతిపై ఫోన్ లో సీరియస్ అయ్యారు.
సివిల్ సప్లై అధికారి పై స్పీకర్ ఆగ్రహం
TAGGED:
ఆమదాలవలసలో తమ్మినేని