జీవితంలో పదవులు వస్తూ ఉంటాయి.. పోతూ ఉంటాయి. కానీ చేసిన పనులే శాశ్వతంగా ప్రజల్లో నిలిచి పోతాయని శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. జిల్లాలోని ఆమదాలవలస మండలం తొగరాం గ్రామంలోని ఉన్నత పాఠశాలలో యూనిసేస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్పీకర్ పాల్గొన్నారు. అనంతరం ఆక్సిజన్ అవసరమైన వారికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను పంపిణీ చేశారు.
పదవులు కాదు.. చేసిన పనులే శాశ్వతం: స్పీకర్ తమ్మినేని సీతారాం - ఆమదాలవలస వార్తలు
ఇతర రాష్ట్రాలకు సీఎం జగన్ ఆదర్శంగా నిలుస్తున్నారని స్పీకర్ తమ్మినేని సీతారాం కొనియాడారు. పదవులు వస్తూ, పోతూ ఉంటాయి. కానీ మనం చేసిన పనులే శాశ్వతంగా ఉంటాయని అన్నారు. తొగరాం గ్రామంలో ఆక్సిజన్ అవసరమైన వారికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను పంపిణీ చేశారు.
స్పీకర్ తమ్మినేని సీతారాం
ఇతర రాష్ట్రాలకు సీఎం జగన్ ఆదర్శంగా నిలుస్తున్నారని స్పీకర్ కొనియాడారు. కరోనా సమయంలో ప్రజలకు అనేక వసతులు కల్పించామన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరావు, ఏపీ ఫైబర్ ఛైర్మన్ గౌతమ్ రెడ్డి, పలువురు వైకాపా నేతలు, ప్రజలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి