ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మీ ఆశీస్సులతోనే ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డాను' - స్పీకర్ తమ్మినేని సీతారాం తాజా వార్తలు

ప్రజల ఆశీస్సులతోనే ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డానని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

speaker tammineni seetharam react on road accident
speaker tammineni seetharam react on road accident

By

Published : Nov 21, 2020, 9:47 PM IST

శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు సభాపతి తమ్మినేని సీతారాం శంకుస్థాపన చేశారు. పాలవలస గ్రామంలో సుమారు 40 లక్షల నిధులతో గ్రామ సచివాలయం భవనం, 21.80 లక్షలు నిధులతో రైతు భరోసా కేంద్రం 17.50 లక్షల నిధులతో వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రం నిర్మించనున్నారు. అనంతరం చిడీవలస, కొల్లివలస గ్రామాల్లో స్పీకర్ పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..... కొల్లివలసలో మహిళలకు ఇబ్బంది లేకుండా ఇంటింటికి కులాయి ఏర్పాటు చేయిస్తామని హామీనిచ్చారు.

మీ ఆశీస్సులు.....

'ఇవాళ నాకు చిన్న ప్రమాదం జరిగింది. అక్కడ్నుంచి నేరుగా ఈ కార్యక్రమానికి వచ్చాను. ప్రజల ఆశీస్సులతో పాటు భగవంతుడు కూడా నా వైపే ఉన్నాడు. అందుకే మీ ప్రేమాభిమానాలతో ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డాను'-తమ్మినేని సీతారాం, స్పీకర్

ఇదీ చదవండి

పోలవరం వద్ద వాజ్​పేయి విగ్రహం పెట్టాలి: సోము వీర్రాజు

ABOUT THE AUTHOR

...view details