శ్రీకాకుళం జిల్లా పొందూరులో ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల సంస్థ మండల స్థాయి గిడ్డంగి ఎంఎల్ఎస్ పాయింట్‌ను సభాపతి తమ్మినేని సీతారాం శుక్రవారం ప్రారంభించారు. గత ప్రభుత్వం పొందూరులో ఉన్న ఎంఎల్ఎస్ స్టాక్ పాయింట్‌ను 4 ఏళ్ల క్రితం సిగడాం తరలించారని.. దీంతో కళాసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని స్పీకర్ అన్నారు. శ్రీకాకుళం డివిజన్లో ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ పాలకొండలో విలీనం చేసి పొందూరుకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం పాలకొండ సబ్ డివిజన్లో ఉన్న సబ్ స్టేషన్‌ను శ్రీకాకుళానికి తిరిగి తీసుకొచ్చామని గుర్తు చేశారు. సిగడాం తీసుకువెళ్లిన ఎంఎల్ఎస్ స్టాక్ పాయింట్‌ను పొందూరు తీసుకొచ్చి ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు.
పొందూరు అభివృద్ధికి కృషి చేస్తాం: తమ్మినేని సీతారాం - development programs at pondhuru updates
పొందూరు అభివృద్ధికి కృషి చేస్తామని సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం జిల్లా పొందూరులో ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల సంస్థ మండల స్థాయి గిడ్డంగి ఎంఎల్ఎస్ పాయింట్‌ను సభాపతి ప్రారంభించారు.
ఎంఎల్ఎస్ స్టాక్ పాయింట్ ప్రారంభించిన సభాపతి
పొందూరు ఖద్దరు అంటే ఆసియా ఖండంలోనే పేరు ఉందని.. అలాంటి పొందూరును భవిష్యత్తులో మంచి స్థాయికి తీసుకువెళ్లడానికి కృషి చేస్తామని సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. వైకాపా శ్రేణులు ఐకమత్యంగా పని చేయాలని కోరారు.
ఇదీ చదవండి:పోలవరంపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు: అనిల్ కుమార్