శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలోని పలు గిరిజన గ్రామాల్లో శాసన సభాపతి తమ్మినేని సీతారాం బుధవారం పర్యటించారు. జంగాలపాడు, లడ్డూరి పేట, బొమ్మిక, కొండపేట గ్రామాలలో సుమారు 7.5 లక్షల అంచనా వ్యయంతో సౌరశక్తి ఆధారిత మంచినీటి సరఫరా పథకాలకు శంకుస్థాపన చేశారు. లడ్డూరిపేట గ్రామంలో ఇటీవల నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. జంగాలపాడు, లడ్డూరిపేట, బొమ్మిక గ్రామాల్లో గిరిజనులకు పట్టాలు అందజేశారు.
ప్రతి గిరిజన గ్రామానికి రోడ్లు, సాగు, తాగునీరు అందించడమే వైకాపా ప్రధాన కర్తవ్యమని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సదుపాయాన్ని గిరిజనులకు చేరాలనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. సుమారు 30 వేల ఎకరాల భూములను పంపిణీ చేశామన్నారు.