శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలో పలు అభివృద్ధి పనులకు శాసన సభాపతి తమ్మినేని సీతారాం ప్రారంభోత్సవం చేశారు. ముందుగా చిన్నజొన్నవలస, గాజులు కొల్లివలస, చిట్టివలస, పొన్నంపేటలో మనబడి నాడు నేడు కింద పనులు పూర్తి చేసిన స్కూళ్లను పున: ప్రారంభించారు.
మనబడి నాడు-నేడు స్కూళ్లను ప్రారంభించిన స్పీకర్ తమ్మినేని - నాడు-నేడు స్కూళ్లను ప్రారంభించిన స్పీకర్ తమ్మినేని
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలో పలు అభివృద్ధి పనులకు శాసన సభాపతి తమ్మినేని సీతారాం ప్రారంభించారు . చిన్నజొన్నవలస, గాజులు కొల్లివలస, చిట్టివలసలో మనబడి నాడు నేడు కింద పనులు పూర్తైన పాఠశాలలను పున:ప్రారంభించారు.
స్పీకర్ తమ్మినేని
ఆమదాలవలస ఎడ్యుకేషన్ హబ్‌గా మారుతుందని స్పీకర్ అన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సీఎం జగన్ ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. పాఠశాలలను అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారని అన్నారు. ప్రతి సారి ఇలా విమర్శిస్తున్నందువల్లే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో ప్రతి పక్షాలు గల్లంతయ్యాని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి: Rains Effect:పొంగిపొర్లుతున్న మహేంద్రతనయ నది.. సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్న ప్రజలు