ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇళ్లపట్టాల పంపిణీపై స్పీకర్ తమ్మినేని సమీక్ష - పట్టాల పంపిణీపై స్పీకర్ తమ్మినేని సమీక్ష తాజావార్తలు

ముఖ్యమంత్రి జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారని సభాపతి తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. పట్టాల పంపిణీపై ఆయన శ్రీకాకుళం జిల్లా బూర్జ తహసీల్దార్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఇళ్లపట్టాల పంపిణీపై స్పీకర్ తమ్మినేని సమీక్ష
ఇళ్లపట్టాల పంపిణీపై స్పీకర్ తమ్మినేని సమీక్ష

By

Published : Dec 22, 2020, 9:06 PM IST

శ్రీకాకుళం జిల్లా బూర్జ తహసీల్దార్ కార్యాలయంలో స్పీకర్ తమ్మినేని సీతారాం ఇళ్ల పట్టాల పంపిణీపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ఎటువంటి గొడవలు, కేసులు లేకుండా అధికారులు ముందుస్తు చర్యలు చేపట్టి పట్టాలు మంజూరు చేయాలని ఆదేశించారు.

రైతు కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం కృషి

పోలాకి మండలం కొండలక్కివలసలో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకాన్ని కలెక్టర్ నివాస్‌తో కలిసి తమ్మినేని ప్రారంభించారు. రైతు కష్టాలను తీర్చేందుకు వైకాపా ప్రభుత్వం శ్రమిస్తోందన్నారు. అందుకోసం సుమారు వెయ్యి కోట్లతో భూముల రీసర్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.

ఇదీచదవండి

ప్రజల ఆస్తులు కొట్టేసేందుకు జగన్ ప్రణాళికలు: చంద్రబాబు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details