ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్థానిక ఎన్నికలు.. ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలు: స్పీకర్ - స్పీకర్ తమ్మినేని తాజా వార్తలు

పంచాయతీ ఎన్నికల్లో చూపించిన స్ఫూర్తిని వచ్చే పురపాలిక, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ చూపించాలని శాసనసభాపతి తమ్మినేని సీతారాం.. ప్రజలకు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా తొగరాంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలు
స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలు

By

Published : Feb 17, 2021, 4:08 PM IST

స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలని శాసనసభాపతి తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్​లో భాగంగా తన స్వగ్రామమైన శ్రీకాకుళం జిల్లా తొగరాంలో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

రెండు దశల పోలింగ్ లో చూపించిన స్ఫూర్తిని పురపాలిక, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ చూపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తొగరాం పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థిగా తమ్మినేని సతీమణి వాణిశ్రీ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details