ఉత్తరాంధ్ర కోసం ఆమదాలవలసలో బయోలాజికల్ కంట్రోల్ ల్యాబ్‌ని ఏర్పాటు చేస్తున్నట్టు సభాపతి తమ్మినేని సీతారం తెలిపారు. ఈ ల్యాబ్ ద్వారా తయారైన జీవరసాయన ఎరువులు వేయడం ద్వారా పంట దిగుబడి, భూసారాన్ని కాపాడడానికి ఉపయోగపడుతుందని వివరించారు. ఈ ల్యాబ్ గురించి రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఈ ల్యాబ్ ద్వారా తయారైన జీవరసాయనాలు ఆర్బీకేల ద్వారా రైతులకు అందజేస్తామని వెల్లడించారు.
ఆమదాలవలసలో అభివృద్ధి పనులకు సభాపతి తమ్మినేని శంకుస్థాపన - AP News
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మున్సిపాలిటీలో తాగునీటి పైపు లైన్, వ్యవసాయ బయోలాజికల్ కంట్రోల్ ల్యాబ్ నిర్మాణానికి సభాపతి తమ్మినేని సీతారాం శంకుస్థాపన చేశారు. మున్సిపాలిటీకి తాగునీరు అందించేందుకు ప్రధాన పైపులైన్ సుమారు రూ.65 లక్షల నిధులతో దండ్రాసి మెట్ట నుంచి రైల్వే గేట్ వరకు ఏర్పాటు చేయనున్నారు. ఆమదాలవలస మార్కెట్ యార్డులో సుమారు 1.37 కోట్లు వ్యయంతో వ్యవసాయ బయోలాజికల్ కంట్రోల్ ల్యాబ్ శంకుస్థాపన చేశారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన స్పీకర్ తమ్మినేని