ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవిడ్ నుంచి కోలుకున్న స్పీకర్ సహా కుటుంబ సభ్యులు - కోలుకున్న స్పీకర్ తమ్మినేని సీతారాం

కొవిడ్ చికిత్స పొందిన స్పీకర్ తమ్మినేని , సహా ఆయన కుటుంబ సభ్యులు మధ్యాహ్నం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రజలెవరూ కరోనాకు భయపడాల్సింది ఏమీ లేదని.. మనోధైర్యంగా ఉంటే త్వరగా కోలుకోవచ్చని సభాపతి తమ్మినేని సూచించారు.

కొవిడ్ నుంచి కోలుకున్న స్పీకర్ సహా కుటుంబ సభ్యులు
కొవిడ్ నుంచి కోలుకున్న స్పీకర్ సహా కుటుంబ సభ్యులు

By

Published : May 12, 2021, 12:43 PM IST

శాసన సభాపతి తమ్మినేని సీతారాం, ఆయన సతీమణి, కుమారుడు కరోనా బారి నుంచి కోలుకున్నారు. అనంతరం ఆస్పత్రి నుంచి అందరూ డిశ్చార్జయ్యారు. ఈ ముగ్గురూ ఇటీవలే కొవిడ్ బారిన పడి శ్రీకాకుళంలోని మెడి కవర్ ఆస్పత్రిలో చికిత్స పొందారు.

మనోధైర్యంగా ఉండాలి..

మధ్యాహ్నం సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికెళ్లారు. కరోనా సోకిన ప్రజలెవరూ ఆందోళన చెందకుండా మనో ధైర్యంతో ఉండాలని స్పీకర్ పిలుపునిచ్చారు. తమకు మెరుగైన చికిత్స అందించిన ఆస్పత్రి యాజమాన్యానికి, వైద్య సిబ్బందికి తమ్మినేని కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇవీ చూడండి :కొవిడ్​ వ్యాక్సిన్లపై రాష్ట్రాలకు కేంద్రం వెసులుబాటు

ABOUT THE AUTHOR

...view details