జగనన్న విద్యా దీవెన పథకంతో తల్లులు, పిల్లల ఆనందానికి అవధులు లేవని... స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని... వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. పేద పిల్లలు బాగా చదువుకోవాలనే సంకల్పంతోనే ముఖ్యమంత్రి జగన్ ఈ పథకానికి రూపకల్పన చేశారని వివరించారు.
జగనన్న విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించిన స్పీకర్
రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి... జగనన్న విద్యాదీవెన పథకాన్ని ప్రారంభించారని సభాపతి తమ్మినేని సీతారం ఉద్ఘాటించారు. ఈ పథకం ద్వారా ఫీజు రీయంబర్స్మెంట్ను తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు.
శ్రీకాకుళంలో జగనన్న విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించిన స్పీకర్