శ్రీకాకుళం జిల్లా పొందూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో నిర్వహించిన గ్రామ వాలంటీర్ల సమావేశంలో రాష్ట్ర అసెంబ్లీ సభాపతి తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. వాలంటీర్లకు దిశానిర్దేశం చేశారు. విధులు పట్ల తాను పూర్తి అవగాహనతో ఉన్నానని... ఎప్పుడూ వ్యవస్థలను భ్రష్ఠు పట్టించే దిశగా పనిచేయబోనని స్పష్టం చేశారు. ప్రజలు శాసనసభ సభ్యుడిగా ఎన్నుకుంటేనే తనకు సభాపతిగా అవకాశం వచ్చిందని గుర్తు చేసుకున్నారు. మొదట తాను ఎమ్మెల్యేనని... నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారానికి శానస సభ్యుడిగా తనకు బాధ్యత ఉందని స్పష్టం చేశారు.
'మొదట నేను శాసనసభ్యుడిని... తరువాతే సభాపతిని' - tammineni sitharam
విధులు పట్ల పూర్తి అవగాహనతో ఉన్నానని.. ఎప్పుడూ వ్యవస్థలను భ్రష్ఠు పట్టించే దిశగా పనిచేయబోనని సభాపతి తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. శ్రీకాకులం జిల్లా పొందూరు వ్యవసాయ మార్కెట్ కమిటీలో నిర్వహించన వాలంటీర్ల సదస్సుకు ఆయన హాజరయ్యారు.
'మొదట నేను శాసనసభ్యుడిని... తరువాతే సభాపతిని'