ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గొప్ప మానవతావాది అని సభాపతి తమ్మినేని సీతారాం కొనియాడారు. శ్రీకాకుళంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో మాట్లాడిన ఆయన... వైకాపా ప్రభుత్వ తొలి ఏడాది పాలన అద్భుతంగా సాగిందని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థపై తమకు అపార గౌరవం ఉందన్న సభాపతి.. ఎస్ఈసీ రమేశ్‌కుమార్ వ్యవహారంలో హైకోర్టు తీర్పును చదివిన తర్వాత మాట్లాడతానని అన్నారు.
'తొలి ఏడాది పాలన అద్భుతంగా సాగింది' - శ్రీకాకుళంలో స్పీకర్ తమ్మినేని పర్యటన
తొలి ఏడాది రాష్ట్రంలో అద్భుత పాలన సాగిందని సభాపతి తమ్మినేని సీతారాం ఆనందం వ్యక్తం చేశారు. పేదల కోసం సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని ప్రశంసించారు.
'హైకోర్టు తీర్పును చదివిన తర్వాత మాట్లాడతా'
Last Updated : May 30, 2020, 1:16 PM IST
TAGGED:
srikakulam latest news