ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 11, 2020, 8:38 PM IST

Updated : Apr 11, 2020, 10:04 PM IST

ETV Bharat / state

నిత్యవసర సరకుల రవాణా పేరుతో వస్తే కఠిన చర్యలు

శ్రీకాకుళం జిల్లాలోని కొత్తపేట వద్ద ఏర్పాటు చేసిన చెక్​పోస్ట్​ను ఎస్పీ అమ్మిరెడ్డి పరిశీలించారు. జిల్లాలో మరో మూడు ప్రాంతాల్లో తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.

SP examined   checkpost   in  kothapet
కొత్తపేట చెక్‌పోస్టును పరిశీలించిన ఎస్పీ

కరోనా ప్రభావం లేకపోయినా శ్రీకాకుళం జిల్లా పోలీసులు మరింత జాగ్రత్త పడ్డారు. జిల్లాలోని కొత్తపేట వద్ద ఏర్పాటు చేసిన చెక్​పోస్టును ఎస్పీ అమ్మిరెడ్డి పరిశీలించారు. టెక్కలి, కోటబొమ్మాళి మండలం కొత్తపేట, నవభారత్‌ కూడలిలో తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వారికి కరోనా పరీక్షలు చేసి... దగ్గరలోని రిలీవ్ కేంద్రాలకు పంపిస్తామని తెలిపారు. చెక్​పోస్టుల వద్ద రెవెన్యూ సిబ్బందితో వాహనాలు సమకూర్చామని ఆయన పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ ముగిసే వరకు ఆ కేంద్రాల్లోనే వీరిని ఉంచేందుకు తగిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. నిత్యవసర సరకుల రవాణా పేరుతో అక్రమంగా ప్రవేశించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

Last Updated : Apr 11, 2020, 10:04 PM IST

ABOUT THE AUTHOR

...view details