శ్రీకాకుళం జిల్లాలోని దేవాలయాలతో పాటు ప్రార్థన మందిరాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎస్పీ అమిత్ బర్దార్ అన్నారు. గ్రామ రక్షణ దళాల సభ్యులు, మహిళా సంరక్షణ కార్యదర్శులుతో జిల్లాలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఎస్పీ దిశానిర్ధేశం చేశారు. గత ఏడాది సెప్టెంబర్ నెల నుంచి కొంతమంది తప్పుడు సమాచారంతో.. మత సామరస్యానికి భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
అలాగే... సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజాశాంతికి భంగం కలిగేలా కొందరు ప్రవర్తిస్తున్నారని చెప్పారు. అలాంటి సంఘటనలను ఎదుర్కోవాలనే ముఖ్య ఉద్దేశంతోనే గ్రామ స్థాయిలో.. రక్షక దళాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని దేవాలయాలపై జరుగుతున్న దాడులపై కమిటీ సభ్యులు స్పందించి.. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలని సూచించారు. ఏ సంఘటన జరిగినా సామాజిక మాధ్యమల ద్వారా వైరల్ అవ్వకుండా.. అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.