రష్యాలో వైద్య విద్య అభ్యసిస్తున్న కొంతమంది విద్యార్థులు కరోనా కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. వారిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఏడుగురు విద్యార్థులు ఉన్నారు. వారు స్వదేశానికి వచ్చేందుకు సహాయం కోసం ట్విట్టర్ ద్వారా సోనూసూద్‌ను అర్థించారు. స్పందించిన ఆయన... వారంతా భారత్‌కు వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.
ఈనెల 24న వారంతా ప్రత్యేక విమానం ద్వారా స్వదేశానికి చేరుకున్నారు. తమ పిల్లలు ఇళ్లకు వచ్చేందుకు సహాయం చేసిన సోనూకు విద్యార్థుల తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.