శ్రీకాకుళం జిల్లా రాజాం మండలంలోని గాడిముదిడం గ్రామంలో బస్టాండ్‌కి కేటాయించిన స్థలంలో గ్రామ సచివాలయం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారంటూ రైతు సత్య నారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. గ్రామంలోని 193 సర్వే నంబర్లోని 20 సెంట్ల స్థలాన్ని బస్ షెల్టర్ ,కాంప్లెక్స్‌కు అధికారులు కేటాయించారు. ప్రస్తుతం ఆ స్థలంలో కొంతమంది సచివాలయాన్ని నిర్మించాలని యత్నిస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
వాదనలు విన్న న్యాయస్థానం నెల రోజుల్లో సమస్యను పరిష్కరించాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. పరిష్కరించిన నివేదికను హైకోర్టుకు సమర్పించాలని ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.