ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని విశ్వబ్రాహ్మణులు కోరారు. లాక్ డౌన్ కారణంగా.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పారు. ఆమదాలవలసలో శాననసభాపతి తమ్మినేని సీతారాంను కలిసి.. వినతిపత్రం ఇచ్చారు.
ఒక్కో కుటుంబానికి పది వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని కోరారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్తానని వారికి సభాపతి తమ్మినేని హామీ ఇచ్చారు. పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.