ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాస్కులున్నాయ్​... గొడుగులున్నాయ్​... భౌతికదూరమెక్కడ? - పాలకొండ తాజా వార్తలు

పాలకొండ వద్ద ఉన్న మద్యం దుకాణం దగ్గర మందుబాబులు గుమిగూడారు. అసలే వ్యాధులు ప్రబలే కాలం... ఆపై కరోనా ఉన్న సమయం. ప్రజలు భౌతిక దూరం పాటించి జాగ్రత్తలు తీసుకోవాల్సిన తరుణంలో మందుబాబులు మాత్రం తమకు ఇవేవీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.

social distance were not maintaining at palakonda government liquor shop
పాలకొండ మద్యం దుకాణం వద్ద భౌతిక దూరం మరచిన జనం

By

Published : Aug 16, 2020, 5:13 PM IST

కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం మద్యం దుకాణాల వద్ద నిబంధనలు విధించింది. దుకాణాలకు వచ్చేవారు విధిగా మాస్కులు ధరించి, గొడుగు పట్టుకుని ఉండాలని అధికారులు చెప్పారు. కానీ శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్​ దగ్గరున్న మద్యం దుకాణాం వద్ద పరిస్థితి మరోలా ఉంది. అధికారులు చెప్పిన మాటలను పెడచెవిన పెట్టారు. మాస్కులు వేసుకుని వచ్చినా... భౌతిక దూరాన్ని మరిచారు. గొడుగులు ఒకరిద్దరు వెంట తెచ్చుకున్నా...మిగతా వారు అవేమీ లేకుండా మద్యం షాపు దగ్గర బారులు తీరారు.

ABOUT THE AUTHOR

...view details