శ్రీకాకుళం జిల్లా సంత బొమ్మాళి మండలం నౌపడ గ్రామానికి చెందిన యర్రం రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో.. పాముల గుంపు బయటపడింది. గోడలో నక్కిన వాటిని గమనించిన కుటుంబీకులు.. తవ్వినకొద్దీ బయటికి వచ్చిన పాములు చూసి భయభ్రాంతులకు గురయ్యారు. నిన్న రాత్రి భోజనం చేస్తుండగా... గోడ వద్ద రెండు పాము పిల్లలను గమనించారు. కాసేపటికి మరికొన్నింటిని గుర్తించారు. అనంతరం గోడను పగలగొట్టగా సుమారు 60 పిల్లల వరకూ బయటపడ్డాయి. విషయం తెలుసుకున్న గ్రామస్థులు సర్పాలను హతమర్చారు.
ఇంటి గోడలో పాముల గుంపు... తవ్వినకొద్దీ ఒళ్లు జలదరింపు! - noupada snakes viral news
పాము కనబడగానే ఒళ్లు జలదరిస్తుంది. అలాంటిది సర్పాల గుంపు ఓ ఇంట్లో తిష్ట వేస్తే ఎలా ఉంటుందో ఊహించండి? శ్రీకాకుళం జిల్లాలోని ఓ ఇంట్లో జరిగిన ఈ ఘటన వివరాలూ మీరూ తెలుసుకోండి.
ఇంటి గోడ కన్నంలో పాములు ...తీస్తున్న కొద్ది వస్తూనే ఉన్నాయి