మైసూర్ మహారాజు ఈస్ట్ ఇండియా కంపెనీతో 1818లో కుదుర్చుకున్న పురాతన ఒప్పంద పత్రం తమ వద్ద ఉందని అమ్మబోయిన ఆరుగురు సభ్యుల ముఠాను టెక్కలి పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల్లో ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఉన్నారు.
పోలీసుల కథనం మేరకు..
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నీలంపేట గ్రామానికి చెందిన యజ్ఞల చిరంజీవి పెయింటింగ్ పనులు నిర్వహిస్తుంటాడు. ఇతడికి మూడు నెలల కిందట ఒడిశాలోని కాశీనగర్ ప్రాంతానికి చెందిన కరణం సంపతిరావు పరిచయం అయ్యాడు. ఆయన వద్ద పురాతన తామ్రపత్రం ఉందని, దాన్ని ఇంట్లో పెట్టుకుంటే ధనలాభం కలుగుతుందని చెప్పడంతో వీరు మరో నలుగురితో కలసి అమ్మేందుకు ప్రయత్నించారు.