కాకినాడతీరంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లి తప్పిపోయిన ఆరుగురు మత్స్యకారులు.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం డి.మత్యలేశం సముద్ర తీరానికి మంగళవారం సురక్షితంగా చేరుకున్నారు. గ్రామస్థుల సహాయంతో అధికారులు సముద్రంలో నిలిచిపోయిన బోటును గుర్తించి... మత్స్యకారులను క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. అనంతరం బోటుకు మరమ్మతులు చేపట్టారు. ప్రస్తుతం బోటులో ఉన్న వారంతా సురక్షితంగా ఉండటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
సంద్రంలో చిక్కుకున్న ఆరుగురు మత్స్యకారులు సేఫ్ - Six fishermen from Kakinada reached safely
చేపల వేటకు వెళ్లి చిక్కుకుపోయిన మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. కాకినాడ పోర్టు నుంచి బయలదేరిన ఆరుగురు మత్స్యకారులను శ్రీకాకుళం జిల్లా డి.మత్యలేశం సముద్ర తీరానికి చేరుకున్నారు. బోటులో ఉన్న వారంతా సురక్షితంగా ఉండటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
Fishermen got stuck in sea: కాకినాడలోని పర్లోపేటకు చెందిన ఆరుగురు మత్స్యకారులు వేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకుపోయారు. బోటు యజమాని కాసరపు కన్నారావు, మత్స్యకారులు కాసరపు గుర్రయ్య, పోతురాజు, ఎల్లాజి, చింతపల్లి చిన్న, పొట్టి సందీప్ గత నెల 30న చేపల వేటకు కాకినాడ రేవు నుంచి బయల్దేరారు. రెండ్రోజుల తరువాత బోటు ఇంజిన్ మరమ్మతులకు గురవడంతో నడి సంద్రంలో ఆగిపోయింది. 3న భీమునిపట్నం, విశాఖ మధ్యలో ఉన్నట్లు జీపీఎస్ రీడింగ్ ద్వారా తెలుసుకున్నారు. ఆ తరువాత వారి నుంచి సమాచారం ఆగిపోయింది.
ఇదీ చదవండి:సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులు.. రక్షించాలని వినతి