శ్రీకాకుళం జిల్లాలోని సింగుపురం గ్రామంలో శ్రీ హఠకేశ్వర స్వామి జాతర ప్రతి ఏడాది వైభవంగా జరిగేది. వేలల్లో భక్తులు వచ్చి కుంకుమ, వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకునేవారు. పెద్ద ఎత్తున భక్తులు ఎరుపు వస్త్రాలు ధరించి స్వామివారికి దోబు ఉత్సవం జరిపేవారు. కానీ కరోనా వైరస్ కారణంగా స్వామి వారి కల్యాణాన్ని ఈ ఏడాది నిడారంబరంగా జరిపామని ప్రధాన అర్చకులు పెంట రామకృష్ణ శర్మ తెలిపారు. భక్తులు గుడి దగ్గరికి వెళ్లకుండా ప్రధాన ద్వారం వద్ద ముళ్ల కంపలు అడ్డుగా పెట్టారు. గుడి పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి.
నిరాడంబరంగా సింగుపురం హఠకేశ్వర స్వామి జాతర
కరోనా ప్రభావం సింగుపరం గ్రామంలోని శ్రీ హఠకేశ్వర స్వామి జాతరపై పడింది. ప్రతి సంవత్సరం వైభవంగా జరిగే ఈ వేడుకను వైరస్ వ్యాప్తి కారణంగా ఈ ఏడాది నిరాడంబరంగా ముగించారు.
Singapuram Hathakeswara Swami Jatara was performed modestly due to corona