శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బొరివంకలో సుద్ద ముక్కలతో తయారుచేసిన వినాయక విగ్రహం అందర్నీ ఆకర్షిస్తోంది. గత 12 ఏళ్ల నుంచి వినూత్నంగా ప్రతిమలు తయారు చేస్తున్న శిల్పి బైరి తిరుపతి ఈసారి సుద్దముక్కలతో గణనాథుడిని తయారు చేశారు. 300 రోజులపాటు శ్రమించి దాదాపు 3 వేల 500 సుద్దముక్కలను ఉపయోగించి ఈ ప్రతిమను తయారు చేశారు. ప్రతి సుద్దముక్కపై కూడా కాణిపాక గణపతి ఆకృతి చెక్కడం ఈ గణనాథుడి ప్రత్యేకత. పర్యావరణ పరిరక్షణ కోసమే ఈ గణపయ్యను తయారు చేశామని నిర్వహకులు తెలిపారు. తమ గ్రామంలో తయారు చేసిన విగ్రహాలకు ప్రపంచస్థాయి గుర్తింపు లభించిందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
3500 సుద్ద ముక్కలతో కాణిపాక గణపతి - special ganesh
వినాయకచవితి వచ్చిందంటే చాలు...విభిన్న ఆకృతుల వినాయకులు దర్శనమిస్తుంటారు. రకరకాలుగా గణనాథుడిని తయారు చేసి ప్రత్యేకత చాటుకోవాలని ప్రజలు ప్రయత్నిస్తుంటారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో 300 రోజులపాటు శ్రమించి దాదాపు 3500 సుద్ద ముక్కలతో గణపయ్యను తయారు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
సుద్ద ముక్కలతో... సిద్ధి వినాయకుడు