ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శాంతి భద్రతలకే తొలి ప్రాధాన్యం: డీఎస్పీ శ్రావణి - ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫిర్యాదు

పాలకొండ డివిజన్ నూతన డీఎస్పీగా శ్రావణి బాధ్యతలు చేపట్టారు. శాంతి భద్రతలకే తొలి ప్రాధాన్యం అని ఆమె తెలిపారు. స్టేషన్​కు వచ్చే ప్రతి ఒక్కరినీ గౌరవించేలా సిబ్బందికి ఆదేశాలు పంపామన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఫిర్యాదు చేయాలని సూచించారు.

shravani is new DSP
డీఎస్పీ శ్రావణి

By

Published : Nov 21, 2020, 4:15 PM IST

శ్రీకాకుళం జిల్లా పాలకొండ నూతన డీఎస్పీగా శ్రావణి బాధ్యతలు స్వీకరించారు. శాంతిభద్రతలకు తొలి ప్రాధాన్యం ఇస్తామని ఆమె తెలిపారు. పోలీస్ స్టేషన్​కు వచ్చే ప్రతి ఒక్కరినీ గౌరవించే విధంగా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామన్నారు. చిన్నపిల్లలు, మహిళల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తామని వివరించారు. నాటుసారాపై ప్రత్యేక దృష్టి సారించి నివారణకు తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫిర్యాదు చేయాలన్నారు. అధికారులు స్పందించని పక్షంలో నేరుగా తనకు సమాచారం అందించాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details