శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కార్తీక మాసం ఆరంభంతో శివాలయాలు... కైలాసనాథుని నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. భక్తులు నదీ తీరాల్లో పుణ్యస్నానాలు ఆచరించి... శివునికి క్షీరాభిషేకాలు, లింగార్చనలు జరిపిస్తున్నారు. దక్షిణ కాశీగా పేరొందిన శ్రీముఖలింగంలోని శ్రీముఖలింగేశ్వరుడు.. కార్తీక కైలాసంగా పేరుగాంచిన రావివలస శైవక్షేత్రం.. ఎండలమల్లికార్జున స్వామి.. నాగావళి నది ఒడ్డున ఉమారుద్రకోటేశ్వరస్వామితో పాటు జిల్లాలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజామునుంచే భక్తులు కార్తీక దీపాలు వెలిగించి... విశ్వేశ్వరుడికి నైవేద్యం సమర్చించి.. పూజించారు.
శ్రీకాకుళం.. సర్వం శివనామ స్మరణం - శ్రీకాకుళంలో కార్తీక మాస ఉత్సవాలు
శ్రీకాకుళంలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తీక మాసం ప్రారంభానికి.. సోమవారం తోడైన కారణంగా.. నదుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. భక్తితో విశ్వేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
కైలాసనాథుని నామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు