నరసన్నపేటలో వాకర్లు నడకలు..పీఎస్కు తరలింపు
ప్రభుత్వాలు, పోలీసులు ప్రజలను బయటకు రావొద్దని ఎంత చెప్పినా కొన్ని చోట్ల ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కరోనా వ్యాప్తి కట్టడికై లాక్డౌన్ నిర్వహించిన వేళ నరసన్నపేటలో వాకర్లు రహదారిపై నడిచి వెళుతుండగా అడ్డుకున్న పోలీసులు వారిపై చర్యలు తీసుకున్నారు.
నరసన్న పేటలో వాకర్లు...పరుగులు
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో శుక్రవారం సాయంత్రం పలువురు వాకర్లు పరుగులు తీశారు. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉన్నప్పటికీ సాయంత్రం కొంతమంది మహిళలు, యువకులు, వృద్ధులు వ్యాయామం కోసం రహదారిపై నడిచి వెళ్లడాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఓ వైపు ప్రభుత్వాలు స్వీయ నిర్బంధం పాటించాలని చెప్తున్నా వినకపోవడం వల్ల పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వారిని పోలీసుల వాహనాల్లో ఎక్కించుకొని స్టేషన్కు తరలించారు.