శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలోని డొంకూరు సముద్రం రోజురోజుకి ముందుకురావడంపై మత్స్యకారులు, గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున సముద్రంలో ఉద్ధృతి పెరిగి భారీ అలలు రావడంతో వాటి తాకిడికి ఇసుకదిబ్బలు కోతకు గురయ్యాయి. దీంతో అలలు పెరిగి సముద్రం నీరు ఇసుక దిబ్బలపై నుంచి మత్స్యకారులు భద్రపరిచిన వలల వద్దకు వస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఈపరిస్థితి ఇలా కొనసాగితే మరికొన్ని రోజుల్లో గ్రామానికి అలలు తాకుతాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
100 అడుగుల ముందుకు సముద్రం..ఆందోళనలో మత్స్యకారులు - శ్రీకాకుళం జిల్లా వార్తలు
రోజురోజుకీ సముద్రం ముందుకొస్తోంది. దీంతో మత్స్యకారులు, గ్రామస్థుల ఆందోళన చెందుతున్నారు. అలలు పెరిగి సముద్రం నీరు ఇసుక దిబ్బలపై నుంచి మత్స్యకారులు భద్రపరిచిన వలల వద్దకు వస్తున్నాయి.
see water