సచివాలయ సిబ్బందికి శిక్షణ - Secretariat staff training program news
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఎంపీడీవో కార్యాలయంలో సచివాలయ సిబ్బంది శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన 509 రకాల పౌర సేవల గురించి ప్రతి సచివాలయ సిబ్బంది తెలుసుకోవాలని అధికారులు సూచించారు.

గ్రామ సచివాలయంలో పౌర సేవలు అందించేందుకు సచివాలయ సిబ్బంది మరింత చొరవ చూపాలని గ్రామ వార్డు సచివాలయ శాఖ రాష్ట్ర అదనపు డిప్యూటీ కమిషనర్ సుధాకర్ రావు సూచించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఎంపీడీవో కార్యాలయంలో సచివాలయ సిబ్బంది శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. 509 రకాల సేవలు ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని, వీటన్నింటిని గ్రామస్థాయిలో పౌరులకు అందించే బాధ్యత సచివాలయ సిబ్బందిపై ఉందన్నారు. అలాగే నరసన్నపేట మేజర్ పంచాయతీ కార్యాలయంలో మధ్యాహ్నం వాలంటీర్లతో సమావేశమయ్యారు. ప్రతి ఇంటికి వెళ్లి పౌర సేవల గురించి వివరించాలని వాలంటీర్లకు సూచించారు.