VAMSADHARA శ్రీకాకుళం జిల్లా హిరమండలం గొట్టా బ్యారేజీ వద్ద వంశధార నదిలో నీటి ప్రవాహం పెరిగింది. ఆంధ్రా-ఒడిశా ప్రాంతాల్లో రెండు రోజులగా కురుస్తున్న వర్షాలకు వంశధార నదిలో వరద ఉధృతి పెరిగింది. ప్రధానంగా ఒడిశా పరివాహక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా జోరు వానలు కురవడంతో.. అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం 80వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో 21 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జిల్లాలోని కొత్తూరు మండలంలోని మాతల గ్రామం వద్ద రోడ్డుపై నీరు చేరడంతో ప్రజలు బయటికి రావడానికి నానా అవస్థలు పడుతున్నారు.
వంశధారలో పెరిగిన నీటి ప్రవాహం, రెండో ప్రమాద హెచ్చరిక జారీ
VAMSADHARA ఆంధ్రా-ఒడిశా ప్రాంతాల్లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వంశధార నదిలో వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
VAMSADHARA