Sculpture of Mosque: రంజాన్ స్పెషల్.. అందరూ కలిసిమెలిసి ఉండాలని సైకత శిల్పం - శ్రీకాకుళం జిల్లా లేటెస్ట్ అప్డేట్స్
Sculpture of mosque: ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలుపుతూ సైకత శిల్పి ఏర్పాటు చేసిన సైకత శిల్పం అందరినీ ఆకట్టుకుంటోంది. మతాలకతీతంగా అందరూ కలిసి ఉండాలనే సందేశాన్ని ఈ శిల్పం ద్వారా చాటారు.
మసీద్ సైకత శిల్పం
Sculpture of mosque: శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం గాజులల్లివలస సంగమేశ్వర కొండ వద్ద గేదెల హరికృష్ణ ఇసుకతో వేసిన మసీద్ సైకత శిల్పం ఆకట్టుకుంటోంది. రంజాన్ పండుగ వేళ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సైకత శిల్పం వేసినట్లు హరికృష్ణ తెలిపారు. మత ప్రమేయం లేకుండా అందరం కలిసిమెలిసి ఉండాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: నేడే రంజాన్.. ముస్లిం సోదరులకు ప్రముఖుల శుభాకాంక్షలు